Home   »  వినోదం   »   RGV ‘వ్యూహం’ ట్రైలర్ విడుదల… జగన్ కు సోనియా వార్నింగ్, పవన్ శపథం

RGV ‘వ్యూహం’ ట్రైలర్ విడుదల… జగన్ కు సోనియా వార్నింగ్, పవన్ శపథం

schedule raju

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ (Vyooham Trailer)ను ఆర్జీవీ విడుద‌ల చేశారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను తనదైన శైలిలో చూపించారు.

వ్యూహం ట్రైల‌ర్‌ (Vyooham Trailer) విడుదల

వ్యూహంట్రైలర్ (Vyooham Trailer) సోనియా గాంధీ పాత్రతో ఫోన్ కాల్ చేయడంతో మొదలవుతుంది. జగన్ పాత్రలో నటించిన అజ్మల్ ఓదార్పు యాత్రను ఆపేయాలని అమీర్‌ను హెచ్చరించాడు. ఇక చంద్రబాబు పాత్ర పోషించిన వ్యక్తి తెరపైకి వస్తాడు. ఇప్పుడు మా స్ట్రాటజీ మొదలవుతుందని చాకచక్యంగా డైలాగ్ చెప్పారు. కళ్యాణ్‌కి తన శత్రువు ఎవరో, మిత్రుడెవరో తెలియదని బాబు క్యారెక్టర్‌లోని డైలాగ్‌తో పాటు పలు ఆసక్తికర వాస్తవ సన్నివేశాలను వర్మ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

వైఎస్ జగన్ బాడీ లాంగ్వేజ్ ను అజ్మల్ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడని చెప్పొచ్చు. అలాగే వైఎస్ భారతిగా మానస కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కానుంది. శపథం (వ్యూహం 2) రెండో భాగాన్ని 2024 జనవరి 25న విడుదల చేయనున్నట్టు వర్మ ప్రకటించారు.

Also Read: షారుఖ్‌ ఖాన్ ‘డుంకీ’ మూవీ వాయిదా… ఊపిరి పీల్చుకుంటున్న సాలార్ టీం?