Home   »  వినోదం   »   “పుష్ప2” టోటల్‌ రైట్స్‌కు రూ.1000 కోట్ల ఆఫర్‌?

“పుష్ప2” టోటల్‌ రైట్స్‌కు రూ.1000 కోట్ల ఆఫర్‌?

schedule raju

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ సినిమాకు భారీ డిమాండ్‌ నెలకొంది. పుష్ప సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో ‘పుష్ప2’ రైట్స్‌ కోసం బయ్యర్‌లు ఆసక్తి చూపుతున్నారు. తాజా నివేదిక ప్రకారం ‘పుష్ప2’ టోటల్‌ రైట్స్‌ (థియేటరికల్‌, నాన్‌ థియేటరికల్స్‌) కోసం రూ.1000 కోట్లు ఆఫర్‌ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను రూ.450 కోట్లతో నిర్మించనున్నారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో.. పుష్ప సీక్వెల్ కాస్త వరల్డ్ వైడ్ గా మరోసారి మార్మోగిపోయింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాకు మేకింగ్ దశలోనే ఊహించని ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్లు ఆఫర్ చేసిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది.