Home   »  వినోదం   »   Rules Ranjan Postponed: ‘రూల్స్ రంజన్’ సినిమాకు మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

Rules Ranjan Postponed: ‘రూల్స్ రంజన్’ సినిమాకు మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

schedule raju

Rules Ranjan Postponed: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) సినిమా రూపొందింది. దివ్యాంగ్ – మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో కిరణ్ జోడీగా నేహా శెట్టి (Neha Shetty) అలరించనుంది. ఈ సినిమా విడుదలకు ముందుగా ఒక డేట్ అనుకున్నారు.. అయితే కొన్ని కారణాల వలన వాయిదా (Rules Ranjan Postponed) వేసుకున్నారు. 

Also Read: ‘సలార్‌ సినిమా’ పోస్ట్‌పోన్‌?.. కన్ఫర్మ్‌ చేసిన హీరో

సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ డేట్ పై మరో అప్డేట్ అందించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 28 నుంచి తప్పించి అయితే వచ్చే అక్టోబర్ 6న అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు.

Also Read: Rules Ranjan: కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ ట్రైలర్… కామెడీ సూపర్.!

అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన మెరుగైన ప్రతిభ ను కనబరుస్తున్నారు. 

దాంతో మరో ఫన్ ఫిల్మ్ థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారు.

తన కాలేజీలో అమ్మాయి మళ్ళీ పరిచయం అయితే… ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? రూల్స్ రంజన్ కాస్తా పబ్ రంజన్, మనో రంజన్ కింద ఎందుకు మారాడు? అనేది కథగా తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో మెహర్ చాహల్ రెండో కథానాయిక. ఇంతకు ముందు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’లో ఆమె ఓ కథానాయికగా నటించారు. ఇంకా ‘రూల్స్ రంజన్’ సినిమాలో వెన్నె కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష (హర్ష చెముడు), అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు నటించగా స్టార్ లైట్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఏ ఎం రత్నం సమర్పణలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.