Home   »  వినోదం   »   వెంకటేష్ సైంధవ్ నుండి సరదా సరదాగా పాట విడుదల

వెంకటేష్ సైంధవ్ నుండి సరదా సరదాగా పాట విడుదల

schedule raju

Saindhav Movie Sarada Saradaga Song: విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సైంధవ్’. వెంకీ కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలోని సెకండ్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరదా సరదాగా…’ అంటూ సాగే ఈ పాట సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసాడు.

Venkatesh Saindhav Movie Sarada Saradaga Song release

Saindhav Movie Sarada Saradaga Song: విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సైంధవ్’. వెంకీ కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్‌ని కూడా మూవీ టీమ్ విడుదల చేశారు. విజయవాడ VVIT కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

‘సరదా సరదాగా..’ సెకండ్ సింగిల్‌ | Saindhav Movie Sarada Saradaga Song

ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలోని సెకండ్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరదా సరదాగా…’ అంటూ సాగే ఈ పాట (Saindhav Movie Sarada Saradaga Song) సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసాడు. అయితే, ఈ పాటలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. వెంకీ కూతురిగా సారా ఈ పాటకు హైలైట్ గా మారింది. అయితే, ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. వెంకటేష్, శ్రద్ధా, సారా మధ్య సాగే ఈ పాట హృదయాలను హత్తుకుంటుంది. ఈ పాటలో వెంకటేష్, శ్రద్ధా కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ముగ్గురి మధ్య బంధాన్ని వివరిస్తుంది. ఈ పాటలో అనురాగ్ కులకర్ణి వాయిస్ హైలైట్‌గా నిలిచింది.

ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్

ఇక ‘సైంధవ్’ సినిమాలోని మొదటి పాట మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసింది. రెండో పాట (Saindhav Movie Sarada Saradaga Song) కుటుంబ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. నిజానికి వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తారు. అతని బ్లాక్ బస్టర్ హిట్లలో చాలా వరకు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలే. ఈ సినిమా కూడా అదే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో కూతురి సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

సంక్రాంతి బరిలో ‘సైంధవ్’

2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. తమిళ హీరో ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, రుహాని శర్మ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 22న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో మేకర్స్ సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు.

Also Read: సైంధవ్ షూటింగ్ కోసం విజయవాడ చేరుకున్న వెంకటేష్