Home   »  వినోదం   »   Salaar OTT Rights: సలార్ మరో బిగ్ స్టెప్.. డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్!

Salaar OTT Rights: సలార్ మరో బిగ్ స్టెప్.. డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్!

schedule raju

Salaar OTT Rights: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ చేయనున్నది చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. నవంబర్‌లో థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్ కలెక్షన్ల సునామీ సృష్టించటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కాగా, తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కుల డీల్ జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. 

Also Read: Salaar Official: సలార్‌ విడుదల అధికారికంగా వాయిదా

ఈ సినిమా ఓటీటీ హక్కులకు (Salaar OTT Rights) సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో .. సోనీ లివ్ .. నెట్ ఫ్లిక్స్ వారు పోటీపడినట్టుగా చెబుతున్నారు. చివరికి నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. భారీ ధరకు ఈ డీల్ జరిగిందని అంటున్నారు. అయితే సౌత్ ఇండియా తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ రైట్స్ మాత్రమే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ పై క్లారిటీ రాలేదు.

Also Read: Salaar Release Date: సలార్ కొత్త రిలీజ్ డేట్… ఎప్పుడంటే.?

ఇందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు 185 కోట్లను చెల్లించినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ కి గల మార్కెట్ .. ప్రశాంత్ నీల్ కి గల ఇమేజ్ .. హోంబలే బ్యానర్ వ్యాల్యూ ఇందుకు కారణమని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలను పోషించారు.

Also Read: “సలార్‌” నైజాం రైట్స్‌కు రూ.80 కోట్లు ఆఫర్‌

సలార్ విడుదల తేదీ

ఇప్పుడు ప్రభాస్ అభిమానులు డిజిటల్ రైట్స్ న్యూస్ కంటే కూడా కొత్త విడుదల తేదీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు.

తొలుత ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి.

ఆ తర్వాత దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం వచ్చింది.

ఏ విషయమైనా అధికారికంగా వెల్లడించే వరకు నమ్మలేం. సినిమా పనులు పూర్తి కావడం మీద ఆధారపడి ఉంటుంది.