Home   »  వినోదం   »   Siddharth and Aditi Rao Hydari | రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. ఎక్కడంటే?

Siddharth and Aditi Rao Hydari | రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. ఎక్కడంటే?

schedule raju

Siddharth and Aditi Rao Hydari | గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్, బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీల రిలేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారట. వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి వివాహం జరిగిందని సమాచారం.

Siddharth and Aditi Rao Hydari secretly married

‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరీని రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఎట్టకేలకు ప్రేమ పక్షులు ఈరోజు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి.

వనపర్తి జిల్లాలో Siddharth and Aditi Rao Hydari పెళ్లి

తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. అయితే, రహస్యంగా జరిగిన ఈ పెళ్లి తంతు కార్యక్రమానికి మీడియాతో పాటు ఆలయ సిబ్బంది‌ని కూడా టెంపుల్‌లోకి రానివ్వలేదనే వార్తలు వినబడుతున్నాయి.

సిద్దార్థ్ మరియు అదితి తమ సంబంధాన్ని ఎప్పుడూ బయట పెట్టనప్పటికీ, వారు వివిధ సందర్భాలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా కూడా అదితి సిద్ధార్థ్‌తో ఉన్న చిత్రాన్ని పంచుకుంది మరియు హ్యాపీ న్యూ ఇయర్ సందేశంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ఆ మధ్య హీరో శర్వానంద్ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది.

రెండో పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితి రావు హైదరీ

సిద్ధార్థ్ తెలుగు సినిమా “మహా సముద్రం” సెట్స్‌లో అదితిని కలిశాడని మరియు ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుండి ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారని తెలుస్తోంది.

కాగా వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. సిద్ధార్థ్‌ 2003లో మేఘన (Meghana)ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితి రావు హైదరీని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra)ను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంది.

Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న సానియా మీర్జా భర్త..?