Home   »  వినోదం   »   Singer Mangli | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్‌ మంగ్లీ..!

Singer Mangli | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్‌ మంగ్లీ..!

schedule raju

Singer Mangli | ప్రముఖ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది.

Singer Mangli was injured in a road accident

ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ (Singer Mangli) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఇంటికి వెళ్తున్న మంగ్లీ కారును DCM వ్యాన్ వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి మంగ్లీ నందిగామ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా తొండుపల్లి వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.

Singer Mangliతో పాటు మరో ఇద్దరికి గాయాలు

కారును DCM వాహనం ఢీకొట్టడంతో మంగ్లీతో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు మేఘరాజ్, మనోహర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో DCM డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. మంగ్లీ అంతకుముందు రోజు కన్హ శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవానికి హాజరయ్యారు. హైవేపై ఇంటికి తిరిగి వస్తుండగా శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శంషాబాద్ పోలీసులు DCM డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం.. రూ.7.85 లక్షల చోరీ