Home   »  వినోదం   »   Skanda | రామ్‌ పోతినేని “స్కంద” సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌

Skanda | రామ్‌ పోతినేని “స్కంద” సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌

schedule raju

ప్రభాస్ సలార్ (Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో ఆ విడుదల తేదీని ఆక్రమించడానికి చాలా మంది ప్రయత్నించారు. నిజానికి ముందుగా రావాల్సిన ‘స్కంద’ (Skanda) సినిమా కూడా మంచి తేదీ అని వెనక్కి వెళ్లిపోయింది.

ప్రధానాంశాలు:

  • ‘సలార్’ వాయిదాతో సెప్టెంబర్ 28 ఖాళీ
  • ఇప్పటికే లైన్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
  • ఇప్పుడు పోటీగా రామ్ పోతినేని ‘స్కంద’

‘స్కంద’ సినిమా రిలీజ్‌

యంగ్‌ హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్కంద’ (Skanda) సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ మార్చేశారు. మొదట ఈనెల 15న రిలీజ్‌ చేస్తామని ప్రకటించగా… ప్రభాస్‌ ‘సలార్‌’ వాయిదా పడినందున స్కంద‘ (Skanda) సినిమా ను ఈనెల 28న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారు.

ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల నటించగా.. తమన్‌ మ్యూజిక్‌ అందించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం & కన్నడ భాషల్లో మూవీ రిలీజ్‌ కానుంది.

ఈ సినిమాకు ఇప్పటికే భారీ బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది. సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉండటంతో సెప్టెంబర్ 28 మిలాద్ ఉన్ నబి, 29, 30 సాధారణ వీకెండ్ అవ్వగా, అక్టోబర్ 1 ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్బంగా లాంగ్ వీకెండ్ ను ఉపయోగించుకోవచ్చని స్కంద టీమ్ మొదట భావించింది. కానీ ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ వాయిదా పడినందున 28న స్కంద రిలీజ్‌ చేస్తున్నారు.

సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్సినిమా వాయిదా

ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్’ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు.

అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది.

దీంతో ఈ తేదీని ఆక్యుపై చేయడానికి పలు సినిమాలు ప్రయత్నించాయి. ముందుగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘రూల్స్ రంజన్’ కొత్త విడుదల తేదీగా సెప్టెంబర్ 28ని ప్రకటించింది.

సెప్టెంబర్ 15న విడుదలయ్యే చంద్రముఖి సీక్వెల్‌, మార్క్‌ ఆంటోని సినిమాలపై మంచి హైప్ వచ్చింది.