Home   »  వినోదం   »   సూపర్ స్టార్ మహేష్ బాబు ఓజీ సినిమాలో… అసలేమైందంటే.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓజీ సినిమాలో… అసలేమైందంటే.?

schedule raju

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫోటోలు, టీజర్ సినిమాపై భారీ హైప్ పెంచింది. అయితే ఓజీ సినిమాలో గెస్ట్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

అయితే మహేష్ బాబు వారి ఆఫర్ ని ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదంట. అలాగే ఆ చిత్ర యూనిట్ కి నో అని చెప్పలేదంట. దీంతో ఏమైనా గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందా అనే డౌట్ అందరికి వస్తోంది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎవరి సినిమాలలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్స్ చేయలేదు.

అలాంటిది మహేష్‌తో ఓజీలో క్యామియో చేయించాలని చిత్రయూనిట్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. పైగా ఇది త్రివిక్రమ్‌ సలహానేనని ఇన్‌సైడ్‌ టాక్‌. ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న మహేష్‌ మరి ఈ క్యామియో రోల్‌ గురించి ఏమంటాడో చూడాలి. అయితే కొంత వరకు మాత్రం ఇది పక్కా గాసిప్‌ అనే అంటున్నారు.

రాజమౌళి మహేష్ కాంబో రాబోతున్న మూవీ హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతుండగా కేఎల్ నారాయణ నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. ఓజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.