Home   »  వినోదం   »   సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్, లావణ్యల శుభలేఖ… ధర ఎంతో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్, లావణ్యల శుభలేఖ… ధర ఎంతో తెలుసా?

schedule raju

Varun Tej-Lavanya Wedding card: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి నిశ్చితార్థం జరుపుకున్నారు.

రూ. 7 లక్షలతో వెడ్డింగ్ కార్డ్ (Wedding card)

వీరిద్దరి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. వరుణ్ తేజ్ తన పెళ్లి కార్డు (Wedding card)ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ మరియు లావణ్యల గ్రీటింగ్ కార్డ్ ధర రూ. 7 లక్షలు. వరుణ్ తేజ్, లావణ్య తొలిసారి కలిసి నటించిన చిత్రం మిస్టర్ ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది.

వీరి ప్రేమ అక్కడ మొదలైంది కాబట్టి పెళ్లిని ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తమ పెళ్లికి సంబంధించిన బ్యాచిలర్ పార్టీలను పూర్తి చేసుకున్నారు. పెళ్లి ఇటలీలో ఉండటంతో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఇటలీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వీరి వివాహానికి సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. మెగా ఫ్యామిలీ అంతా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు. వీరి పెళ్లి ఇటలీలో జరిగినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో జరగనుంది.

Also Read: ఇటలీకి వెళ్తున్న మెగా కుటుంబ సభ్యులు.!