Home   »  జాతీయం   »   ప్రకాష్ రాజ్‌ పై ఫిర్యాదులు… ట్విటర్‌లో ట్రెండ్‌

ప్రకాష్ రాజ్‌ పై ఫిర్యాదులు… ట్విటర్‌లో ట్రెండ్‌

schedule raju

ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3‘ను సినీ నటుడు ప్రకాష్ రాజ్ అవమాన పరిచారని, అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని నెటిజన్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. చంద్రయాన్‌-3ని ఉద్దేశించి ప్రకాశ్‌ రాజ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయడంతో అతనిపై కర్ణాటకలో కేసు కూడా నమోదైంది. అయితే, వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తుండటంతో ట్విటర్‌లో #ArrestPrakashRaj హాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

ప్రకాష్ రాజ్‌ పై ఇప్పటికే రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి, అందులో ఒకటి కర్ణాటకలో నమోదైంది. సంఘ్‌ పరివార్‌ సానుభూతిపరుడు ఎస్‌బీ గయాక్‌వాడ్‌ బాగల్‌కోట్‌ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, షిమోగాకు చెందిన ప్రమోద్‌ ఎన్‌ అనే వ్యక్తి నటుడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.