Home   »  జాతీయంవార్తలు   »   మిషన్‌ చంద్రయాన్‌-3.. ఇవాళ అర్ధరాత్రి కీలకం

మిషన్‌ చంద్రయాన్‌-3.. ఇవాళ అర్ధరాత్రి కీలకం

schedule raju

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మిషన్‌ చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఇవాళ అర్ధరాత్రి కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే 4 దశల్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న మిషన్‌ చంద్రయాన్‌-3.. అర్దరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించి అనంతరం కక్ష్యలోకి చేరనుంది. ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్(TLI) కోసం 28 నిమిషాల నుంచి 31 నిమిషాల వరకు సమయం పట్టనుంది. భూమికి అత్యంత సమీప బిందువు వద్ద ఉన్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ థ్రస్టర్లను మండించి ముందుకు తీసుకెళ్లనున్నారు. చంద్రయాన్-3 ప్రస్తుతం 1 కిమీ/సెకన్, 10.3కిమీ/సెకన్ మధ్య వేగంతో దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ కదులుతోంది.

ఈ ప్రక్రియ కోసం ఇస్రోతో పాటు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుని కక్ష్యను చేరుకోవడం మిషన్ లో ఒక భాగం మాత్రమే. చంద్రయాన్ లను గతంలోనూ ISRO చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టగలిగింది. 2008(చంద్రయాన్-1), 2019(చంద్రయాన్-2) లోనూ చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అసలు సిసలు సవాలు ఎదురయ్యేది మాత్రం చంద్రుని చివరి కక్ష్యలో ఉంటూ.. సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. ఆగస్టు 23వ తేదీ తర్వాత ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది.