Home   »  జాతీయం   »   చంద్రయాన్‌3 పంపిన చంద్రుడి విజువల్స్‌

చంద్రయాన్‌3 పంపిన చంద్రుడి విజువల్స్‌

schedule raju

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్‌ మరో అడుగు దూరంలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చంద్రుడి విజువల్స్‌, 17న ప్రొపల్షన్ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయిన తర్వాత చంద్రుడిపై ల్యాండర్‌ తీసిన ల్యాండింగ్‌ సైట్‌ విజువల్స్‌ను ఇస్రో విడుదల చేసింది.

గతంలో నాసా సహా వేర్వేరు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థలు గుర్తించిన ఎత్తయిన కొండలు, లోతైన అగాథాలు, వాటికి పెట్టిన పేర్లతో సహా ఈ వీడియోలో వివరించారు. ఫ్యాబ్రి, హర్ఖెబి జే, గెర్డానో బ్రూనో..లను గుర్తించారు.