Home   »  జాతీయం   »   విశ్వకర్మ పేరుతో కొత్త పథకం: ప్రధాని మోదీ

విశ్వకర్మ పేరుతో కొత్త పథకం: ప్రధాని మోదీ

schedule raju

స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా విశ్వకర్మ యోజన పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభించనున్నామని, ఇందుకోసం తొలి విడతగా రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

ఈ పథకాన్ని బార్బర్స్‌, రజకులు, కంసలి సహా సంప్రదాయ నైపుణ్యాలు ఉన్న వారి కోసం ఈ పథకాన్ని వినియోగిస్తామని వెల్లడించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ:- “నేను మీ మధ్య నుంచే వచ్చినవాణ్ని. మీ గురించే ఆలోచిస్తా. మీరంతా నా కుటుంబం. నేను మీ కుటుంబంలో ఒకడిని. మా పనితీరు చూసి 2018లో మీరు నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. 2047లో మనం 100 ఏళ్ల స్వతంత్య్ర వేడుకలను చేసుకోబోతున్నాం. మీరు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తే… వచ్చే ఏడాది ఆగస్టు 15న మళ్లీ వస్తా. ఎర్రకోట నుంచి మన దేశ విజయాలను చాటిచెప్తా” అంటూ 2024 ఎన్నికల్లో విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.