Home   »  జాతీయం   »   నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుక

నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుక

schedule raju

భారతదేశంలోనే అదిపెద్ద స్టేడియంగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ఒక రోజు ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐసీసీ వన్డే ప్రపంచకప్ భారత్‌కు తిరిగి వచ్చింది. అక్టోబరు-నవంబర్‌లో జరిగే ఈ టోర్నీకి దేశం పూర్తిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అదే విధంగా 1996, 1987లో కూడా మరోదేశంతో భారత్‌ హక్కులను పంచుకుంది. ఇక ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌- ఇంగ్లండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 4న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుందని క్రిక్‌బజ్ తెలిపింది.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఐసీసీ సభ్యులతో పాటు మిగితా క్రికెట్‌ బోర్డు మెంబర్స్‌ను కూడా ఆహ్హానించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ ప్రారంభ వేడుకలకు టోర్నీలో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు కూడా హాజరుకానున్నారు.

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఇది శ్రీలంక, పాకిస్తాన్‌లలో హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో టీమిండియా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ పాక్-నేపాల్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ 30న నిర్వహించనున్నారు.