Home   »  అంతర్జాతీయం   »   26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి..!

26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి..!

schedule mahesh
26/11 mumbai blast mastermind azam cheema dead

Azam Cheema | 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఆజం చీమా (Azam Cheema) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ ( Faisalabad) లో గుండెపోటుతో మృతి చెందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో అతని అంత్యక్రియలు పూర్తయినట్లు తెలుస్తుంది.

నవంబర్ 26, 2008న జరిగిన ముంబై పేలుళ్ల ఘటన

15 ఏళ్ల క్రితం నవంబర్ 26, 2008న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. కొలాబా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా హోటల్ తాజ్ సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 166 మంది మరణించారు.

దాడికి ప్రధాన సూత్రధారి ఆజం చీమాగా గుర్తింపు

26/11 దాడి ప్రధాన సూత్రధారిగా ఆజం చీమాను గుర్తించారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆజం శిక్షణ ఇచ్చాడని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. దింతో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో అతని పేరును చేర్చింది.

26/11 పేలుళ్లతో పాటు, ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్ సూత్రధారిగా పని చేసాడు. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పేలుళ్లలో 188 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మంది గాయాలపాలయ్యారు.

Also Read | భారత పర్యటనకు వచ్చిన స్పానిష్ మహిళపై అత్యాచారం