Home   »  అంతర్జాతీయం   »   పాకిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం..

పాకిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం..

schedule mahesh

Earthquake in Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది.

4-7-magnitude-earthquake-in-pakistan

Earthquake in Pakistan | పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. పాక్ లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) తెలిపింది. భూమికి 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ భూకంపం స్వల్ప తీవ్రత కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

కాగా, గత శనివారం రాత్రి కూడా పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్‌లలో భూప్రకంపనలు సంభవించాయి. దేశ వాతావరణ శాఖ ప్రకారం భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Also Read | పాకిస్తాన్ నూతన ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్.!