Home   »  అంతర్జాతీయం   »   ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు..!

ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు..!

schedule mahesh

America | ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా దళాల స్థావరంపై ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా దాడులు ప్రారంభించింది.

america-airstrikes-hit-over-85-targets-in-iraq

America | జోర్డాన్‌లోని అమెరికా సైనిక శిబిరంపై ఇటీవల జరిగిన దాడికి ప్రతిస్పందనగా అమెరికా దాడులు ప్రారంభించింది. ఇరాక్ మరియు సిరియాలోని ఇరానియన్ రివల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85 కంటే ఎక్కువ మిలీషియా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని US యుద్ధ విమానాలు దాడులు చేసాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు హతమయ్యారు.

మొత్తం 85 స్థావరాలపై విరుచుకుపడిన US వైమానిక దళాలు

మిలిటెంట్లకు చెందిన ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇంటెలిజెన్స్ సెంటర్లు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి నిల్వ గోడౌన్లు, లాజిస్టిక్ సదుపాయాలపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక శిబిరంపై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అందులో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతేకాకుండా దాదాపు 40 మంది సైనికులు గాయపడ్డారు.

జోర్డాన్‌లోని America స్థావరాలపై ఇటీవల ఉగ్రవాదుల దాడి

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు US సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన విధంగా సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందారని బైడెన్‌ తెలిపారు.

Also Read | United States | అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి