Home   »  అంతర్జాతీయం   »   జపాన్‌లో మరో భూకంపం..

జపాన్‌లో మరో భూకంపం..

schedule sirisha

సెంట్రల్ జపాన్ పశ్చిమ తీరంలో హోన్షు ప్రిఫెక్చర్‌లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Another earthquake in Japan

Earthquake in Japan | సెంట్రల్ జపాన్ పశ్చిమ తీరంలో హోన్షు ప్రిఫెక్చర్‌లో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం బలమైన ప్రకంపనలకు కారణమైంది. అయితే సునామీ హెచ్చరికల కేంద్రం ఎలాంటి హెచ్చరికలను జారీ చేయక పోవడంతో ముందస్తు చర్యలు తీసుకోలేక పోతున్నాం అని ప్రభుత్వం తెలిపింది.

Earthquake in Japan | జపాన్ లో వరుస భూకంపాలు

జపాన్ లో అంతకుముందు జనవరి 1 2024 రోజున జపాన్ వెస్ట్ కోస్ట్‌ లో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన అతి బలమైన భూకంపం వల్ల 202 మంది మరణించారు. 565 మంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ భూకంపం సంభవించడం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. హోకురికు ప్రాంతంలో 23,000 ఇళ్లకు విద్యుత్తు లేకుండా పోయింది.

2016లో నైరుతి జపాన్‌లోని కుమామోటోలో సంభవించిన భూకంపాల వల్ల 276 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Also read: జపాన్‌లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం.. మృతుల సంఖ్య 57కి చేరింది.