Home   »  అంతర్జాతీయం   »   ఇజ్రాయెల్‌లో జరిగిన దాడులలో భారతీయ మహిళకు గాయం

ఇజ్రాయెల్‌లో జరిగిన దాడులలో భారతీయ మహిళకు గాయం

schedule sirisha

జెరూసలేం | attacks in Israel: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉత్తర ఇజ్రాయెల్ నగరంపై రాకెట్ల వర్షం కురిపించడంతో అష్కెలాన్‌లో సంరక్షకురాలిగా పనిచేస్తున్న భారతీయ మహిళ గాయపడినట్లు సోమవారం ఉదయం అక్కడి అధికారులు తెలిపారు.

Attacks in Israel లో ఆనంది అనే మహిళకు గాయాలు

కేరళకు చెందిన షీజా ఆనంది అనే మహిళ శనివారం చేతులకు కాలుకు గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ఆమె కోలుకోవడం కోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వారు ప్రకటించారు.

భారతీయ మిషన్ సహాయం కోసం ఆమె అభ్యర్థించింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఆమె కుటుంబంతో మాట్లాడింది. “ఆమె కుటుంబానికి సమాచారం అందించాము. మేము ఆమె కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము” అని రాయబార కార్యాలయం వెల్లడించింది.

ఇజ్రాయెల్ పై శనివారం ఉదయం దాని దక్షిణ భాగాలలో గాజా స్ట్రిప్‌ను పాలించే హమాస్ అకస్మాత్తుగా దాడిని చేసింది.

ఇజ్రాయెల్‌లో సైనికులతో సహా కనీసం 700 మంది మృతి చెందారు. 2,100 మందికి పైగా గాయాల పాలయ్యారు. కనీసం 50 సంవత్సరాలలో ఇజ్రాయెల్ దేశానికి ఇది అత్యంత ఘోరమైన రోజుగా పరిగణిస్తున్నారు.

Also read :ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల 700 మంది మృతి!