Home   »  అంతర్జాతీయం   »   Fire Accedent: పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం.. 100 మంది మృతి..

Fire Accedent: పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం.. 100 మంది మృతి..

schedule ranjith

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం (Big Fire Accedent) సంభవించింది. ఓ ఫంక్షన్‌ హాలులో ఒకసారిగా రగులుకున్న మంటలు . ఆ ప్రమాదంలో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు. 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఉత్తర ఇరాక్‌లోని నినేవే ప్రావిన్స్‌లో ఘటన

ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో మరిచిపోని విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలలో అప్పటి వరకూ సందడిగా ఉన్న ఫంక్షన్‌ హాలులో ఒక్కసారిగా హాహాకారాలతో మారు మోగిపోయింది. ఫంక్షన్‌ హాలులో ఒక్కాసారిగా మంటలు రగులుకోవాడంతో దాదాపు 100 మందికిపైగా మరణించారు. మరో 150 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మరణల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఉత్తర ఇరాక్‌లో నిన్న మంగళవారం (సెప్టెంబర్‌ 26) రాత్రి చోటుచేసుకుంది.

Big Fire Accedent ప్రమాదంలో 100 మంది మరణింగ మరో 150 మందికి గాయాలు

వివరాల్లోకెళ్తే.. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్ 26) రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా మరణించారు 150 మందికి గాయపడినట్లు ఇరాక్‌ స్థానిక మీడియా,అధికారులు పేర్కొంనరు . గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇరాక్‌ పోలిస్ అధికారులు చెబుతున్నారు.

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీంను, సంఘటన స్థలానికి తరలించి. సహాయక చర్యలు చేపట్టారు. నిన్న (సెప్టెంబర్26) రాత్రి 10:40 గంటల ప్రాంతంలో ఫంక్షన్‌ హాల్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన జరిగిన సమయంలో పెళ్లి మండపంలో వందలాది మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడికొచ్చిన పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: GPS Bill: జీపీఎస్ బిల్లులో మళ్లీ మార్పులు … క్యాబినెట్ ఆమోదానికి పంపిన Ap ప్రభుత్వం