Home   »  అంతర్జాతీయం   »   భారత్‌పై ప్రశంసలు కురిపించిన బిల్ గేట్స్..!

భారత్‌పై ప్రశంసలు కురిపించిన బిల్ గేట్స్..!

schedule raju
Bill Gates praised India

Bill Gates | భారత్ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనల నుంచి ప్రపంచ దేశాలు ఎంతో నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ఇటీవల భారతదేశంలో పర్యటించిన బిల్ గేట్స్.. మరోసారి భారత్ రావాలని కోరుకుంటున్నట్లు ఆయన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘US తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఎక్కువగా భారత్‌లోనే సేవలు అందిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో గేట్స్ ఫౌండేషన్ ఇంకా ఏ విధంగా సేవలు అందించగలదనే విషయంపై చర్చించాం’ అని పేర్కొన్నారు.

Bill Gates భారత పర్యటన

గేట్స్ తన భారత పర్యటనను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో ప్రారంభించారు. దాదాపు వారం రోజుల పాటు సాగిన భారత పర్యటనలో గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశమయ్యారు. గేట్స్ ఇటీవల ఢిల్లీలోని IITతో పాటు ఒడిశా రాష్ట్రాన్ని కూడా సందర్శించారు, అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు.

Also Read: S Jaishankar | భారత మంత్రిపై రష్యా ప్రశంసలు..!