Home   »  అంతర్జాతీయం   »   Indonesia: ఇండోనేషియాలోని బాండా సముద్రంలో తీవ్ర భూకంపం.

Indonesia: ఇండోనేషియాలోని బాండా సముద్రంలో తీవ్ర భూకంపం.

schedule ranjith

ఇండోనేషియాలోని బండా సముద్రంలో బుధవారం రాత్రి 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని, ఈ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించిన గంటల తర్వాత ప్రాణ, ఆస్తి నష్టం లేదు అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. తీరానికి దూరంగా ఉన్న ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:02 గంటలకు 6.7 తీవ్రతతో సంభవించిందని USGS తెలిపింది. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

నికోబార్ దీవుల్లో 7.1 తీవ్రతతో భూకంపం

కాగా మంగళవారం ఉదయం 11.53 గంటల సమయంలో నికోబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. అయితే దీని కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.

Indonesia ను వెంటాడుతున్న భూకంపాలు

కాగా భూకంప భయాలు ఇండోనేషియాను వెంటాడుతుంటాయి. ఈ దేశం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ మీదుగా చాలా వరకు విస్తరించి ఉంటుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉంటాయి. మరోవైపు సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతంలోని దేశాల్లో భూకంపాలు అధికంగా నమోదవుతుంటాయి. అంతేకాదు తీవ్రత కూడా ఎక్కువగా నమోదవుతుంటుంది.

also Read: బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం