Home   »  అంతర్జాతీయం   »   ఎలాన్ మస్క్ కు కీలక పదవి ఇస్తా: వివేక్

ఎలాన్ మస్క్ కు కీలక పదవి ఇస్తా: వివేక్

schedule mounika

ఎలాన్ మస్క్ కు కీలక పదవి ఇస్తా అని అమెరికా అధ్యక్షుడి రేసులో ఉన్న వివేక్ రామస్వామి ట్విట్టర్ (X) బాస్ ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్. దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అందువల్ల నేను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే.. ఆయననే ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తా ట్విట్టర్ మాదిరిగానే ప్రభుత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నడిపించగలరు అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు వివేక్ రామస్వామిపై అపర కుబేరుడు, టెక్ దిగ్గజం, సోషల్ మీడియా దిగ్గజం X అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వివేక్ సరైన అభ్యర్థి అని మస్క్ అన్నారు.