Home   »  అంతర్జాతీయం   »   భారత మాజీ నేవీ అధికారుల మరణశిక్షపై…భారత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఖతార్ కోర్టు

భారత మాజీ నేవీ అధికారుల మరణశిక్షపై…భారత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఖతార్ కోర్టు

schedule mahesh

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ కు గూఢచర్యం కేసులో ఖతార్ లో బంధీలుగా 8 మంది మాజీ భారత నేవీ అధికారుల మరణశిక్ష (ex indian navy officers)పై కాస్త ఊరట లభించింది.

ex indian navy officers

భారత్ చేసిన అప్పీల్‌ను అంగీకరించిన ఖతార్ కోర్టు

భారత నేవీ అధికారుల(ex indian navy officers) పై విధించిన మరణశిక్షపై సమీక్ష కోరుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పీలును ఖతార్ కోర్టు అంగీకరించడం జరిగింది. దీనిపై త్వరలో విచారణ ప్రారంభం కాబోతుంది. భారత్ చేసిన అప్పీల్ మేరకు వారి విడుదలకు ఖతార్ కోర్టు అంగీకరిస్తే నేవీ మాజీ సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సులభమవుతుంది.

వారి రాక కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబాలు

వీరి రాక కోసం వారి కుటుంబాలు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. గత నెలలో ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ (ex indian navy officers) సిబ్బందికి మరణశిక్ష విధింపుకు సంబంధించి భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్టు గురువారం విచారణకు స్వీకరించిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్ అప్పీల్‌ను అధ్యయనం చేస్తున్నామన్న ఖతార్ కోర్ట్

తాము భారత్ చేసిన అప్పీల్‌ను అధ్యయనం చేస్తున్నామని, తదుపరి విచారణ త్వరలో ఉంటుందని ఖతార్ కోర్టు వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్‌లోని స్ధానిక కోర్టు దేశంలో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న 8మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధించడం జరిగింది.

ex indian navy officers కి మరణశిక్ష విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చిన ఖతార్ కోర్టు

అయితే ఈ తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ భారత విదేశాంగశాఖ ఖతార్ కోర్టులో అప్పీలు చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఖతార్ కోర్టు భారత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీనిపై త్వరలో విచారణ జరుపుతామని వెల్లడించింది. భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ గతంలో ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పును విదేశాంగశాఖ రహస్యంగా వుంచుతుంది. అయితే వారిని విడిపించేందుకు మాత్రం తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

8 మంది భారత మాజీ నేవీ అధికారులను అరెస్ట్ చేసిన ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

ఈ విషయంపై ఖతార్ అధికారులతో కేంద్రం చర్చలు కొనసాగిస్తుందని, భారత పౌరులకు ప్రభుత్వం అన్ని చట్టపరమైన, కాన్సులర్ సహాయాన్ని అందజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. గత సంవత్సరం ఆగస్టులో ఖతార్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నారు.

భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, నావికుడు రాగేష్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టులో అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా అభియోగాలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించడం జరిగింది.

Also Read: 8 మంది భారతీయులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న నేవీ చీఫ్