Home   »  అంతర్జాతీయం   »   నింగి కెగసిన విమానం … నిమిషాల్లో ల్యాండింగ్…!

నింగి కెగసిన విమానం … నిమిషాల్లో ల్యాండింగ్…!

schedule sirisha

అమెరికాలో ఓ విమానాన్ని నిమిషాల వ్యవధిలో వేల అడుగుల కిందకు దించారు. ఫ్లోరిడాకు వెళ్లే అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇటీవల షార్లెట్‌ నుంచి గెయిన్ట్‌విల్‌కు బయలుదేరింది. విమానం బయలుదేరిన 43 నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటన జరిగింది. ఆరు నిమిషాల వ్యవధిలో 18,600 అడుగుల ఎత్తుకు వరకు ఎలాంటి సమస్య రాలేదు.

11 నిమిషాల వ్యవధిలో విమానం దాదాపు 29వేల అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానంలో పీడనం సమస్య తలెత్తడంతో ఫ్లెట్‌ను తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించారు. ప్రయాణికులకు ఆక్సిజన్‌ మాస్క్‌ అందించి 6ని.ల వ్యవధిలో కిందకు దించారు. ఆ తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కాగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.