Home   »  అంతర్జాతీయం   »   భారతీయ టూరిస్టులకు శుభవార్త… ఇకపై వీసా లేకుండానే ఇరాన్ వెళ్లే అవకాశం

భారతీయ టూరిస్టులకు శుభవార్త… ఇకపై వీసా లేకుండానే ఇరాన్ వెళ్లే అవకాశం

schedule mahesh

ఇరాన్: ఇరాన్ క్యాబినెట్ భారతదేశం (Indian Tourists)తో సహా 33 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు వీసా నిబంధనలను మినహాయించాలని నిర్ణయం తీసుకుంది. అంటే భారతదేశంతో సహా 33 దేశాల పౌరులు ఇరాన్‌ను సందర్శించడానికి ముందస్తు వీసా అవసరం లేదని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Indian Tourists

“ఇరానో ఫోబియా”ను అంతం చేయాలని నిర్ణయం తీసుకున్న ఇరాన్

ఇరాన్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతుల్లా జర్ఘామి తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న ఇరానో ఫోబియా (Iranophobia) ను అంతం చేయాలని, ఆ ఇరానోఫోబియాను ప్రచారం చేస్తున్నవారి ఆట కట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

భారత్ తో (Indian Tourists) సహా 33 దేశాలకు ఫ్రీ వీసా సదుపాయం కల్పించనున్న ఇరాన్

భారత్ సహా రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, బ్రూనై, జపాన్, సింగపూర్, కాంబో, మలేషియా, వియత్నాం, బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, సెర్బియా, క్రొయేషియా మరియు బెలారస్‌లకు ఇరాన్ వీసా ఫ్రీ ఎంట్రీని మంజూరు చేసింది.

ప్రస్తుతం భారత్ కు ఫ్రీ వీసా సదుపాయం కల్పిస్తున్న 27 దేశాలు

గతంలో టర్కీ, రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్, ఒమన్, చైనా, అర్మేనియా, లెబనాన్, సిరియా దేశాలకు ఇరాన్ ఈ అవకాశాన్ని అందించనుంది. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. ఇటీవల కెన్యా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ మరియు శ్రీలంక కూడా ఇటీవల భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించాయి.

Also Read: విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ