Home   »  అంతర్జాతీయం   »   US నౌకపై క్షిపణి దాడులకు పాల్పడ్డ హౌతీ రెబల్స్

US నౌకపై క్షిపణి దాడులకు పాల్పడ్డ హౌతీ రెబల్స్

schedule mahesh

Houthi Rebals | ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. యెమెన్‌ తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటైనర్‌ షిప్‌పై దాడి చేసారు.

houthi-rebals-launch-missile-attacks-on-us-ship

Houthi Rebals | ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. యెమెన్‌ తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటైనర్‌ షిప్‌పై దాడి చేసారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా ఆర్మీ వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో ప్రయాణిస్తున్న గిబ్రాల్టర్ ఈగిల్ అనే కంటైనర్ షిప్‌పై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసినట్లు వెల్లడించారు.

US నౌకపై క్షిపణి దాడులకు పాల్పడ్డ Houthi Rebals

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఓడకు గాని అందులో వున్న సిబ్బందికి గాని ఎలాంటి హాని కలగలేదని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మరోవైపు ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించడం జరిగింది. దింతో ఎర్ర సముద్రంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి.

హౌతీ తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా గత కొన్ని రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులను నిలువరించేందుకు అమెరికా దాని మిత్రదేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఎర్ర సముద్రంలో దాడులు ఆగవన్న హౌతీ రెబల్స్

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ దేశాలు దాడులు ప్రారంభించాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలకు కారణమైన హౌతీల డజనుకు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరు దేశాల సైన్యాలు పెద్ద ఎత్తున బాంబు దాడులు నిర్వహించాయి. అయినా హౌతీలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎర్ర సముద్రంలో దాడులు ఆగవని తెలిపారు. తమపై దాడి చేసిన అమెరికా, బ్రిటన్ లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హౌతీలు హెచ్చరించడం జరిగింది.

Also Read: ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన సుమిత్ నాగల్