Home   »  అంతర్జాతీయం   »   Indian student | భారతీయ అమ్మాయిని కొట్టిన ఆఫ్రికన్ మహిళలు

Indian student | భారతీయ అమ్మాయిని కొట్టిన ఆఫ్రికన్ మహిళలు

schedule ranjith

నెదర్లాండ్స్‌లో ఓ భారతీయ విద్యార్థిని (Indian student) పై ఆఫ్రికన్ మహిళలు దారుణంగా దాడి చేశారు. ఈ దాడికి కారణం ఇంకా కచ్చితంగా తెలియ రాలేదు. దానికి ముందు వీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం కనిపించింది.

ప్రధానాంశాలు:

  • నెదర్లాండ్స్‌లో ఓ భారతీయ విద్యార్థినిపై ఆఫ్రికన్ మహిళలు దారుణంగా దాడి
  • వీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం. కనిపించింది
  • ఆఫ్రికన్ మహిళలు విచక్షణా రహితంగా ముఖం, బాడీపై గుద్దడం, తన్నడం చేశారు
  • ఈ వీడియోను ఎక్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.

బలవంతంగా బ్యాగ్ తీసుకోవడానికి ఆఫ్రికన్ యువతి ట్రై చేయగా భారతీయ అమ్మాయి ప్రతిఘటించింది. దాంతో సదరు ఆఫ్రికన్ లేడీ ఆమెను కొట్టడం ప్రారంభించింది. అక్కడ ఉన్న ఇతర ఆఫ్రికన్ మహిళలు కూడా ఇండియన్ స్టూడెంట్‌ను విచక్షణా రహితంగా ముఖం, బాడీపై గుద్దడం, తన్నడం చేశారు. దీనివల్ల ఆ లేడీ ఎన్నారై నిస్సహాయ స్థితిలో దెబ్బలు తిన్నది. ఈ దాడిని పలువురు ప్రత్యక్షంగా చూసినా ఎవరూ అడ్డుకోలేదు. బదులుగా, వారు తమ మొబైల్ ఫోన్లలో దాడిని చిత్రీకరించారు. కొంతమంది ఇంకా కొట్టాలంటూ ఆఫ్రికన్ మహిళను ఉత్సాహపరుస్తూ కూడా కనిపించారు. చివరికి ఆ ఆఫ్రికన్స్‌ ఇండియన్ స్టూడెంట్‌కు( Indian student ) సంబంధించిన వస్తువులు లాక్కున్నారని తెలిసింది. ఈ వీడియోను ఎక్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. దీన్ని చూసిన చాలామంది ప్రజలు నెదర్లాండ్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తున్నారు. లోకల్ గవర్నమెంట్ ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.