Home   »  అంతర్జాతీయం   »   రఫా న‌గ‌రంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 67 మంది మృతి

రఫా న‌గ‌రంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 67 మంది మృతి

schedule mahesh

Israeli air strikes | ఇజ్రాయెల్ దళాలు రఫా నగరంపై వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 67 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు సమాచారం. ఆ నగరంలోని ఓ భవనం నుంచి ఇద్దరు బందీలను IDF బలగాలు రక్షించాయి.

israeli-air-strikes-on-rafah-city-67-people-died

Israeli air strikes | ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్లీ విధ్వంసకరంగా మారింది. ఈరోజు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజా నగరం రఫాపై మెరుపు దాడికి దిగాయి. ఈ వైమానిక దాడిలో చాలా పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తుంది. ఈ మెరుపు దాడి వల్ల రఫాలో కనీసం 67 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాఫా నగరంలో దాదాపు 15 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు తెలుస్తుంది.

రఫాలో ఇద్దరు బందీలను రక్షించిన IDF బలగాలు

రఫాలో ఇద్దరు బందీలను రక్షించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నగరం మధ్యలో ఓ భవనంలో ఉన్న వృద్ధులను రక్షించారు. రఫాపై దాడి చేసే ప్రణాళికను అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం అనుకున్న‌దే చేస్తుంది. గతేడాది అక్టోబరు 7న గాజాపై హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్ ఎదురుదాడులు ప్రారంభించింది. అక్టోబర్ 7న జరిగిన దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 253 మంది హైజాక్ అయ్యారు. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 28,000 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆరోగ్య విభాగం పేర్కొంది.

Also Read | భారత్‌-మయన్మార్‌ మధ్య రాకపోకలు బంద్‌..!