Home   »  అంతర్జాతీయం   »   ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. కాసేపట్లో ఖాతాల్లో రూ.10 వేలు జమ..

ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. కాసేపట్లో ఖాతాల్లో రూ.10 వేలు జమ..

schedule raju

కర్నూలు: APలో ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu) కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు విడుదలకానున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నాలుగవ ఏడాది ‘జగనన్న చేదోడు’ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) పాల్గొనున్నారు.

ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ YWCS గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో అయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో రూ.325.02 కోట్లను జగన్ జమ చేశారు.

నాలుగవ ఏడాది ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu) కార్యక్రమం

అనంతరం ఎమ్మిగనూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రజక, నాయీబ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీ పడటానికి వారికి చేదోడునిస్తూ వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసిందని తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మందికి రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.

జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకం క్రింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ప్రతి సంవత్సరం రూ. 10,000 చొప్పున సాయం అందిస్తున్నారు. అయితే ఇప్ప్పటి వరకు జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకం కింద ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలలో ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు అని తెలిపారు.

1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల పంపిణి చేసారు. 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి చేకూరింది. 1,04,551 మంది రజకులకు ఈ విడత సాయంగా కింద రూ. 104.55 కోట్ల లబ్ధి చేకూర్చారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా అందజేశారు. అలాగే సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు తెలిపారు.

జగనన్న చేదోడు లబ్దిదారుల అర్హతలు

  1. మొత్తం కుటుంబ వార్షిక ఆదాయం ₹ 2,50,000 కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.
  2. దరఖాస్తుదారు యొక్క మొత్తం కుటుంబ భూమి 10 ఎకరాలలోపు చిత్తడి నేల/ 25 ఎకరాలలోపు లేదా 25 ఎకరాలలోపు తడి మరియు పొడి భూమి ఉండాలి.
  3. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
  4. విద్యార్థులు తప్పనిసరిగా కింది (రెగ్యులర్) కోర్సులలో ఒకదానిలో గుర్తింపు పొందిన కళాశాలలు/విశ్వవిద్యాలయాలు లేదా ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొంది ఉండాలి – B.Tech, B.Pharmacy, ITI, Polytechnic, B.Ed, M.Tech, M.Pharmacy, MBA, ఇతర డిగ్రీ/పీజీ కోర్సులు. * పీజీ కోర్సులకు ప్రభుత్వ/యూనివర్శిటీ కాలేజీలు మాత్రమే అర్హులు.
  5. విద్యార్థులు క్రింది సంస్థలలో ఒకదానిలో నమోదు చేయబడాలి – ప్రభుత్వం లేదా ప్రభుత్వ సహాయం; రాష్ట్ర విశ్వవిద్యాలయాలు / బోర్డులతో అనుబంధించబడిన ప్రైవేట్ కళాశాలలు; డే స్కాలర్ విద్యార్థులు; కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ (CAH) మరియు డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ (DAH)లోని విద్యార్థులు
  6. దరఖాస్తుదారు యొక్క మొత్తం హాజరు 75% ఉండాలి.
  7. కుటుంబంలోని ఏ సభ్యుడు కూడా నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండకూడదు.
  8. దరఖాస్తుదారు కుటుంబం ఎటువంటి ఆస్తిని కలిగి ఉండకూడదు లేదా పట్టణ ప్రాంతాల్లో 1500 చ.అ.ల కంటే తక్కువ బిల్ట్-అప్ ఏరియా (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్) కలిగి ఉండాలి.
  9. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
  10. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ (కాపు కాకుండా), కాపు, మైనార్టీ, వికలాంగులకు చెందిన విద్యార్థులు అర్హులు.

జగనన్న చేదోడు మినహాయింపులు:

డీమ్డ్ మరియు ప్రైవేట్ వర్సిటీలకు (ప్రభుత్వ కోటా మినహా) ఈ పథకం వర్తించదు.
కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
మేనేజ్‌మెంట్ మరియు ఎన్‌ఆర్‌ఐ కోటాలకు చెందిన విద్యార్థికి ఈ పథకం వర్తించదు.

Also Read: హైకోర్టులో సీఎం జగన్ కు ఊరట… మొత్తానికి ఆ కేసుపై హైకోర్టు స్టే