Home   »  అంతర్జాతీయం   »   Khalistani |భారత దౌత్య కార్యాలయం వద్ద ఖలిస్తానీ నిరసనలు

Khalistani |భారత దౌత్య కార్యాలయం వద్ద ఖలిస్తానీ నిరసనలు

schedule mahesh

CANADA: కెనడాలోని వాంకోవర్‌లో భారత దౌత్య కార్యాలయం వెలుపల ఖలిస్తానీ (Khalistani) అనుకూల వాదులు నిర్వహించిన నిరసన ర్యాలీ విఫలమైందని ప్రదర్శనకు కేవలం 25 మంది మాత్రమే హాజరయ్యారని కెనడాలోని భారత ఇంటలిజెంట్ వర్గాలు తెలిపాయి.

Khalistani ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య పై భారత్‌కు వ్యతిరేకంగా నిన్న మధ్యాహ్నం భారత దౌత్య కార్యాలయం వెలుపల ఖలిస్తానీ అనుకూల వాదులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు.

గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో 45 ఏళ్ల ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. భారతదేశం 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం అసంబద్ధం, ప్రేరేపితమైనది అని కొట్టిపారేసింది. ఈ కేసుకు సంబంధించి కెనడాలోని భారతీయ దౌత్య వేత్తని బహిష్కరించినందుకు భారత్ లోని ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది.

దాదాపు 20-25 మంది భారతీయ దౌత్య కార్యాలయం వెలుపల ఖలిస్తాన్ జెండాలతో పాటు కెనడియన్ జెండాలను ఊపారని ఇంటలిజెంట్ వర్గాలు తెలిపాయి. నిరసన ర్యాలీకి హాజరైన ఖలిస్తాన్ అనుకూల వాదులు జస్టిన్ ట్రూడో సిక్కులతో నిలబడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు పట్టుకున్నారు.

నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను బహిష్కరించాలని కెనడాలోని ఖలిస్థానీ అనుకూల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.