Home   »  అంతర్జాతీయం   »   చిలీలో స్తంభాన్ని ఢీకొట్టిన విమానం.. పైల‌ట్ మృతి

చిలీలో స్తంభాన్ని ఢీకొట్టిన విమానం.. పైల‌ట్ మృతి

schedule mahesh

plane accident in chile | చిలీలోని టాల్కా న‌గ‌రంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

the--plane-hit-pole-the-pilot-died

plane accident in chile | చిలీలోని టాల్కా లో ఓ విమానం స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన పైలట్‌ను ఫెర్నాండో సోలన్స్ రోబుల్స్ గా గుర్తించారు.

ప్రమాదాన్ని ధృవీకరించిన చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ..

ప్రమాదానికి గురైన విమానాన్ని ఫైర్‌ఫైట‌ర్ ప్లేన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదాన్ని చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరణించిన పైలట్ ఫెర్నాండో సోలన్స్ రోబుల్స్ (58) నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ఈ అగ్నిమాపక విమానం మంటలను ఎదుర్కోవడానికి, ఆర్పడానికి ఉపయోగించబడుతుంది. అయితే విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా మంటలు రేగాయి. ఈ ప్ర‌మాదంతో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్ర‌మాదానికి గురయ్యింది. దీంతో ఆ కారులో వెళ్తున్న న‌లుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి వుంది.

Also Read: ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం BRSకు లేదన్న వినోద్‌ కుమార్‌