Home   »  అంతర్జాతీయం   »   RISHI SUNAK |G20 అధ్యక్ష పదవికి భారత్ సరైన దేశం…

RISHI SUNAK |G20 అధ్యక్ష పదవికి భారత్ సరైన దేశం…

schedule mahesh

న్యూఢిల్లీ : భారతదేశం దాని అసాధారణ విజయాలు అంటే G 20 అధ్యక్ష పదవిని నిర్వహించడానికి సరైన సమయంలో సరైన దేశమని బ్రిటన్ ప్రధాని RISHI SUNAK నిన్న తెలిపారు.

గత సంవత్సరం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కొనియాడిన RISHI SUNAK ప్రపంచం అసంఖ్యాక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు భారత్ కి G20 కూటమికి అధ్యక్ష పదవి వచ్చిందని తెలిపాడు.

సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి కొద్ది రోజుల ముందు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్రిటన్ యొక్క మొదటి భారతీయ సంతతికి చెందిన

ప్రధాన మంత్రి RISHI SUNAK బ్రిటన్, భారతదేశం మధ్య సంబంధాలు రెండు దేశాల భవిష్యత్తును కూడా నిర్వచించగలవని అన్నారు.

ఈ దేశం యొక్క స్థాయి, వైవిధ్యం, దాని అసాధారణ విజయాలు అంటే G20 అధ్యక్షతను నిర్వహించడానికి సరైన సమయంలో భారతదేశం సరైన దేశమని అర్థం అన్నారు.

గత సంవత్సరం ప్రధాని మోడీ నాయకత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాని రిషి అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపర్చడం నుండి వాతావరణ మార్పుల వరకు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించడానికి మేము భారత్ అధ్యక్షతన G20 సదస్సు ద్వారా భారతదేశంతో కలిసి పని చేస్తామని సునాక్ చెప్పారు. అంతే కాకుండా సునాక్ ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని కూడా ప్రస్తావించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్వభౌమాధికారం కలిగిన పక్క దేశం పై దాడి చేయటం మొత్తం ప్రపంచానికి భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందని నొక్కి చెప్పారు.

రెండు ప్రధాన ప్రపంచ ప్రజాస్వామ్యాలుగా మా ప్రజలు మమ్మల్ని నిర్వచించారు. అందుకే బ్రిటన్ తనను తాను రక్షించుకోవడానికి, చట్టవిరుద్ధమైన

రష్యన్ దండయాత్రను ఓడించడానికి ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం పై దృష్టి పెట్టిందని అతను చెప్పాడు. స్వేచ్ఛాయుతమైన,ప్రజాస్వామ్య దేశంగా ఉక్రెయిన్‌కు తన భవిష్యత్తును తానే తీర్చుదిద్దుకొనే హక్కు ఉందని అన్నారు. ఈ రెండు దేశాలు యుద్దాన్ని నిలిపివేయాలని అన్నారు.