Home   »  అంతర్జాతీయం   »   నేడు అరుదైన పితృ అమావాస్య & సూర్య గ్రహణం…

నేడు అరుదైన పితృ అమావాస్య & సూర్య గ్రహణం…

schedule sirisha

హిందూ మతంలో గ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. గ్రహణం జీవితాలపై శుభా అశుభ ఫలితాలను చూపుతుందని నమ్ముతారు. నేటి సూర్యగ్రహణం (Solar Eclipse) ఈ సంవత్సరం లో చివరి సూర్యగ్రహణం .

నేడు సర్వ పితృ అమావాస్య & సూర్య గ్రహణం (Solar Eclipse)

అంతే కాదు నేడు సర్వ పితృ అమావాస్య మరియు శనివారం కావడంతో “శని అమావాస్య” కూడా. హిందువులు శని అమావాస్యను పవిత్రంగా భావిస్తూ శని దేవుడికి పూజలు చేస్తారు.

ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు చేస్తే దానధర్మాల వల్ల మనం పూర్వ జన్మలో చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు.

అంతేకాదు శని అమావాస్య నేపథ్యంలో ఈ రోజు శనీశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేస్తారు.

ఈ గ్రహణం అక్టోబర్ 14 రాత్రి 08:34 గంటలకు మొదలై అక్టోబర్ 15 తెల్లవారుజామున 02:26 గంటలకు ముగియనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడుకి అడ్డంగా వెళ్లడంతో భూమిపైకి మందమైన సూర్యకాంతి పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. దీంతో సూర్యుడు పెద్దదిగా కనిపిస్తాడు . అయితే ఈ చివరి సూర్యగ్రహణం (Solar Eclipse) భారత్‌పై అతంగా ప్రభావం చూపదని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలిపారు.

Also read : “సెలబ్రిటీ దాండియా నైట్స్” సీజన్ 7 పోస్టర్‌ ఆవిష్కరణ