Home   »  అంతర్జాతీయం   »   పాకిస్తాన్ నూతన ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్.!

పాకిస్తాన్ నూతన ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్.!

schedule mahesh

Shehbaz Sharif | పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (PML-N) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

shehbaz-sharif-will-be-the-new-pm-of-pakistan

Shehbaz Sharif | పాకిస్థాన్‌లో ఇటీవల ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్(PML-N) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్‌ను నియమించాలని PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నిర్ణయించారు.

Shehbaz Sharif మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు

షెహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు. పాకిస్థాన్ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. పంజాబ్‌లో నవాజ్ కుమార్తె మరియం నవాజ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న PTI పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే PTIలోని (Pakistan Tehreek-e-Insaf) తిరుగుబాటుదారులను ఆరు పార్టీల కూటమి ఆహ్వానించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 92 సీట్లు, నవాజ్ షరీఫ్ కు చెందిన PML-N పార్టీ (Pakistan Muslim League N) 79 సీట్లు, బిలావల్ భుట్టో కు చెందిన PPP పార్టీ (Pakistan Peoples Party) 54 సీట్లు గెలుచుకుంది.

Also Read | నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ