Home   »  అంతర్జాతీయం   »   Sherika De Armas: క్యాన్సర్ తో మరణించిన మాజీ మిస్ వరల్డ్ పోటీదారు..

Sherika De Armas: క్యాన్సర్ తో మరణించిన మాజీ మిస్ వరల్డ్ పోటీదారు..

schedule ranjith

2015లో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మిస్ వరల్డ్ పోటీదారు షెరికా డి అర్మాస్ (Sherika De Armas) గత వారం గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఆమె గత రెండేళ్లుగా కీమోథెరపీ మరియు రేడియోథెరపీ చేయించుకుంటున్నట్లు నివేదించింది.

ప్రముఖ మోడల్ Sherika De Armas క్యాన్సర్ తో కన్నుమూత

ప్రముఖ మోడల్, 2015 మిస్ వరల్డ్ పోటీదారు షెరికా డి అర్మాస్ క్యాన్సర్ తో తుది శ్వాస విడిచింది. ఉరుగ్వే దేశానికి చెందిన షెరికా కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న కన్నుమూసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. షెరికా మృతితో ఆమె కుటుంబంలోనూ, సన్నిహిత వర్గాల్లోనూ విషాదం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది.

విషాదంలో ఉరుగ్వే మోడలింగ్ వర్గాలు

ఉరుగ్వేలో అగ్రగామి మోడల్ గా ఉన్న షెరికాకు ఎంతో పాప్యులారిటీ ఉటుంది. ఈ క్రమంలో ఆమె షే డి అర్మాస్ పేరిట శిరోజాలు, పర్సనల్ కేర్ ఉత్పత్తుల వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది. క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం పాటుపడే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ షెరికా పాల్గొనేది.

గత రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న షెరికా

18 ఏళ్ల వయసుకే షెరికా అందాల పోటీల్లో పాల్గొంది. చైనాలో 2015లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న షెరికా టాప్-30లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే, ఆ పోటీల్లో పాల్గొన్న 18 ఏళ్ల వయసున్నవారిలో టాప్-6లో ఒకరిగా నిలిచిపోయింది.

Also Read: Congress |ప్రవళిక మృతిపై KTRకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..