Home   »  అంతర్జాతీయం   »   కెనడాలో మరో సిక్కు వేర్పాటువాది ఇంటిపై కాల్పులు..!

కెనడాలో మరో సిక్కు వేర్పాటువాది ఇంటిపై కాల్పులు..!

schedule mahesh

Sikh separatist | కెనడాలో ఖలిస్థాన్ అనుకూల నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌తో సంబంధం ఉన్న సిక్కు వేర్పాటువాది ఇంటిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది.

another-sikh-separatist's-house-fired-in-canada

Sikh separatist | కెనడాలో ఖలిస్థాన్ అనుకూల నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌తో సంబంధం ఉన్న సిక్కు వేర్పాటువాది ఇంటిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. సోమవారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారుడు ఇందర్‌జిత్ సింగ్ గోసల్‌ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

పన్నూన్‌ సన్నిహితుని ఇంటిపై కాల్పులు

ఫిబ్రవరి 17న టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్తాన్ అనుకూల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇందర్‌జిత్ సింగ్ గోసల్‌ ఇటీవల ప్రకటించారు. గోసల్ సిక్కుల ప్రధాన నాయకుడు అయిన పన్నూన్‌తో సన్నిహితుడని తెలుస్తుంది.

ఇరు దేశాల మధ్య కలకలం రేపుతున్న కాల్పుల ఘటనలు

భారతదేశం, కెనడా దేశాలు పరస్పరం తమ “అంతర్గత వ్యవహారాల”లో జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించుకుంటున్న నేపథ్యంలో ఈ కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత ఏడాది జూన్‌లో కెనడా గడ్డపై జరిగిన హత్యలో న్యూఢిల్లీ పాత్ర ఉందని ఆరోపించిన కెనడా, కొన్ని నెలల తర్వాత తమ ఎన్నికలలో జోక్యం చేసుకోగల “విదేశీ ముప్పు”గా భారత్‌ను పేర్కొంది. కెనడియన్ ఏజెన్సీలు చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం చేసుకుంటోందని భారత్ పేర్కొంది. కెనడా ముఖ్యమైన సమస్య వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తుందని భారతదేశం పదే పదే నొక్కి చెబుతోంది.

Also Read | Oven | బిడ్డను ఓవెన్ లో పెట్టి మరణానికి కారణమైన తల్లి..