Home   »  అంతర్జాతీయం   »   Syria: మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి.. 100మందికి పైగా మృతి..

Syria: మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి.. 100మందికి పైగా మృతి..

schedule ranjith

సిరియాలో విషాదం నెలకొంది. మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి జరిగి 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 200 మంది గాయపడ్డారు.

Syria మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడిలో సుమారు 125 మందికి గాయాలు

సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్‌ దాడి జరిగింది. హోమ్స్‌ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సమయంలో జరిగిన దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 125 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్‌ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సిరియా మిలిటరీ అధికారులు తెలిపారు. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులు గానీ, జిహాదిస్టులు గానీ, ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని.. అయితే, సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్‌ డే ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు ఆరోపించారు.

గ్రాడ్యుయేషన్‌ డే రోజు ఆకస్మిక దాడి

మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తికావడంతో గురువారం క్యాడెట్స్‌కు నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డేకు వారి కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు భారీ ఎత్తున తరలివచ్చారు. వేడుక ముగిశాక అధికారులు, మిలిటరీ క్యాడెట్స్‌ బయటకు వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రోన్ దాడి జరిగింది. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే వందల మంది రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి.

డ్రోన్ల దాడి కి సంబంధించిన వీడియోలు వైరల్

ఆ ప్రాంతమంతా రక్తపు గాయాలతో, హాహాకారాలతో భీతావాహ దృశ్యం కనిపించింది. బాధితుల ఆర్తానాదాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. డ్రోన్ దాడి నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నట్లు సిరియా ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: థియేటర్ లో విధ్వంసం.. బాధ్యులెవరు?