Home   »  అంతర్జాతీయం   »   అరేబియా సముద్రంలో హైజాక్‌ అయిన నౌకలని సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో హైజాక్‌ అయిన నౌకలని సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ

schedule mahesh

INDIAN NAVY: ఆఫ్రికాలోని సోమాలియాలోని అరేబియా సముద్రంలో గురువారం కార్గో షిప్ హైజాక్ గురైంది. లైబీరియన్ జెండాతో కూడిన కార్గో షిప్ ‘ఎంవీ లీలా నార్ఫోక్’లో 15 మంది భారతీయ సిబ్బంది వున్నారు. హైజాక్ గురించి సమాచారం అందుకున్న భారత నావికాదళం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.

the-crew-the-ship-was-rescued-by-the-indian-navy

హైజాక్‌ అయిన నౌకలోని సిబ్బందిని రక్షించిన INDIAN NAVY

సముద్ర గస్తీ విధుల్లో ఉన్న INS చెన్నై మరో గస్తీ విమానంతో కలిసి రంగంలోకి దిగింది. హైజాక్ చేయబడిన నౌక సిబ్బందితో సంప్రదింపులు జరిపింది. ఆ తరువాత ఓడను విడిచిపెట్టమని హైజాకర్లను హెచ్చరించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం హైజాక్‌కు గురైన ఓడ వద్దకు చేరుకున్న ఇండియన్ నేవీ 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మందిని రక్షించారు. అధికారులు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేయడం జరిగింది.

అరేబియా సముద్రంలో వ్యాపార నౌకను హైజాక్ చేసిన దొంగలు

సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి దాదాపు 300 నాటికల్ మైళ్ల దూరంలో ఈ వ్యాపార నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేయడం జరిగింది. ఈ నౌక బ్రెజిల్‌లోని పోర్ట్ డు అకో నుండి బహ్రెయిన్‌లోని ఖలీఫా బిన్ సల్మాన్‌కు వెళ్తున్నట్టు తెలుస్తుంది. గురువారం సాయంత్రం ఆరుగురు సాయుధ దుండగులు నౌకలోకి చొరబడి నౌకను హైజాక్ చేసారు. హైజాక్ జరిగిన వెంటనే, నౌక సంబంధిత సమాచారాన్ని UKMTO పోర్టల్‌కు చేరవేసింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్‌ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ (INDIAN NAVY) ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించింది. పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీ81, ప్రిడేటర్‌ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టారు.

Also Read: బెంగాల్‌ను కుదిపేస్తున్న రేషన్ కుంభకోణం కేసు.. మరో TMC నేత అరెస్ట్‌