Home   »  అంతర్జాతీయం   »   Odisha: ఒడిశాలోని ఇటుక బట్టీలో ఊపిరాడక ఇద్దరు మృతి

Odisha: ఒడిశాలోని ఇటుక బట్టీలో ఊపిరాడక ఇద్దరు మృతి

schedule ranjith

ఒడిశా | మణేశ్వర్‌ గ్రామ సమీపంలోని బ్రాహ్మణి నది ఒడ్డున ఉన్న ఇటుక బట్టీ వద్ద మూసి ఉన్న గదిలో, జనరేటర్‌ నుంచి పొగలు రావడంతో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందారు.

Odisha: Two died due to suffocation in a brick kiln in Odisha

దెంకనల్‌ లోని మణేశ్వర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన

ఒడిశా (Odisha)లోని దెంకనల్ (Dhenkanal) జిల్లాలోని మణేశ్వర్‌ గ్రామ సమీపంలో బ్రాహ్మణి నది ఒడ్డున ఉన్న ఇటుక బట్టీ వద్ద మూసి ఉన్న గదిలో జనరేటర్‌ నుంచి పొగలు రావడంతో, ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. మృతులను దిరిసా కంకెల్ (18), రేయేష్ బనారా (19)గా గుర్తించారు. గాయపడిన ఖండే బన్రా (20) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురిని అంగుల్ జిల్లా పల్లహరా పట్టణంలోని కిషోర్ నగర్ వాసులుగా అధికారులు గుర్తించారు.

కాంటాబానియా IIC దీపికా మాట్లాడుతూ (Odisha)

కాంటాబానియా IIC దీపికా మాట్లాడుతూ, జనరేటర్ ప్రారంభించిన తర్వాత, ముగ్గురు కార్మికులు గురువారం రాత్రి ఇటుక బట్టీ వద్ద ఉన్న గదిలో నిద్రించడానికి వెళ్లారు. రాత్రంతా గదిలో జనరేటర్‌ నుంచి పొగలు కమ్ముకోవడంతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం ముగ్గురు తలుపులు తీయకపోవడంతో తోటి కూలీలకు అనుమానం వచ్చింది. వారు తలుపు కొట్టారు కానీ సమాధానం రాలేదు. అనుమానం వచ్చిన తోటి కూలీ ఒకరు వెంటనే ఇటుక బట్టీ యజమానిని సంప్రదించాడు.

సమాచారం అందుకున్న కాంటబానియా పోలీసులు

సమాచారం అందుకున్న కాంటబానియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. గదిలో ముగ్గురు కూలీలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని అధికారులు గమనించారు. వారిని వెంటనే అంగుల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారిలో ఇద్దరు చనిపోయినట్లు తెలిపారు. కాండే పరిస్థితి విషమించడంతో కటక్‌లోని SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురూ గత మూడు నెలలుగా ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కాంటాబానియా పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Thief: దొంగతనం చేసి చెరువు మధ్యలో కూర్చున్న దొంగ