Home   »  అంతర్జాతీయం   »   WWE ఛాంపియన్‌ గుండెపోటుతో మృతి

WWE ఛాంపియన్‌ గుండెపోటుతో మృతి

schedule sirisha

WWE మాజీ ఛాంపియన్‌ విండ్‌హమ్ రోటుండా బ్రే వ్యాట్‌ (36) మృతిచెందారు. ఈ విషయాన్ని WWE సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యాట్‌ నిన్న (ఆగస్టు 24) గుండెపోటుతో మరణించారు. రోటుండా మూడవ తరం ప్రొఫెషనల్ ఛాంపియన్‌, అతని తాత బ్లాక్‌జాక్ ముల్లిగాన్, అతని తండ్రి మైక్ రోటుండా, అతని ఇద్దరు మేనమామలు బారీ, కెండల్ విండ్‌హామ్‌ల అడుగుజాడలను అనుసరించాడు. కానీ వ్యాట్‌ అనారోగ్య కారణాల దృష్ట్యా అతను గత 6 నెలల నుంచి WWEకి దూరంగా ఉన్నారు. 2009లో ప్రారంభమైన వ్యాట్‌ WWE జర్నీ. ఈ ఏడాది వరకు కొనసాగింది.