Home   »  ఉద్యోగం   »   9,210 జాబ్స్.. తుది కీ విడుదల ఎప్పుడంటే?

9,210 జాబ్స్.. తుది కీ విడుదల ఎప్పుడంటే?

schedule mounika

తెలంగాణ: 9,210 జాబ్స్.. తుది కీ విడుదల ఎప్పుడంటే.. రాష్ట్రంలో 9,210 గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది కీ ని ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తుది కీ విడుదలైన వెంటనే అభ్యర్థుల మార్కులను ప్రకటించనుంది. ఈ నెలాఖరు నుంచి వరుసగా ఒక్కో రోజు ఒక్కో పోస్టు తుది కీ, మార్కులు వెల్లడించనుంది. మొదటగా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు, ఆ తర్వాత పీజీటీ, టీజీటీ ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది.

ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 75.68 శాతం మంది సగటున హాజరైనట్లు బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్య భట్టు తెలిపారు. పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా సమాధానాలు సరి చూసుకోవాలని సూచించింది.