Home   »  ఉద్యోగం   »   త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : మంత్రి సీతక్క

త్వరలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : మంత్రి సీతక్క

schedule sirisha

Anganwadi post | తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్బంగా, కొలువుల భర్తీపైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

Notification for filling 14 thousand Anganwadi posts soon

Anganwadi post | తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క తెలిపారు.

ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు.

Anganwadi post | త్వరలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి సంఘాలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని అన్నారు.

ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Also read: అంగన్‌వాడీలను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్‌ సహించేది లేదు.