Home   »  ఉద్యోగం   »   AP Recruitment | సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

AP Recruitment | సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

schedule sirisha

AP Recruitment: ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కల. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ లు చాలానే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే AP Recruitment కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 250 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను శాశ్వత ప్రతి పాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక సదవకాశం. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సరైన అర్హతలున్న వారు సెప్టెంబరు 24 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది. 

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ లో అందుబాటు లో ఉంచినట్లు ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెల్పింది.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల వివరాలు :-

ఖాళీల సంఖ్య: 250

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 

  • ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాలు,
  • ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు,
  • దివ్యాంగులు 52 సంవత్సరాలు,
  • ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది.

ఇందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్కులకు 75 మార్కులు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పని చేస్తున్న వారికి 15 శాతం మార్కులు, 10 మార్కుల వరకు ఇంటర్న్‌షిప్‌కు కేటాయిస్తారు.