Home   »  ఉద్యోగం   »   DSC 2023 | టీచర్ల భర్తీకి దరఖాస్తులు

DSC 2023 | టీచర్ల భర్తీకి దరఖాస్తులు

schedule sirisha

హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో భాగంగా DSC 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు (సెప్టెంబర్ 20) నుండి ప్రారంభమవుతుండగా అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న ఖాళీల కోసం 5,089 టీచర్ల భర్తీకి విద్యాశాఖ గతంలో సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేసింది.

DSC 2023 | ఖాళీల వివరాలు :-

  • స్కూల్ అసిస్టెంట్ – 1739
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 164
  • సెకండరీ గ్రేడ్ టీచర్ – 2575
  • భాషా పండిట్ – 611

దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రూ.1,000 రుసుము చెల్లించాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఖాళీల కోసం D.Ed పూర్తి చేసి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల కోసం సంబంధిత బోధనా పద్ధతితో B.Ed పూర్తయిన వారు అర్హులు అవుతారు. B.Ed చివరి సెమిస్టర్‌ లో ఉన్న వారితో పాటు నాలుగేళ్ల డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు జూలై 1, 2023 నాటికి 44 సంవత్సరాల వయస్సు మించరాదు. మాజీ సైనికులకు మూడేళ్లు, SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో సడలింపును ప్రభుత్వం మంజూరు చేసింది. అదనంగా వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సంగారెడ్డి తో సహా మొత్తం పది జిల్లాల ప్రధాన కార్యాలయంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యారంగ అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు నిర్దిష్ట గడువులోపు చేసుకోవాలని తెలిపారు.