Home   »  ఉద్యోగం   »   9210 పోస్టుల భర్తీ.. రేపటితో ముగియనున్న పరీక్షలు

9210 పోస్టుల భర్తీ.. రేపటితో ముగియనున్న పరీక్షలు

schedule raju

తెలంగాణ: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీ కి పోస్ట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఈనెల 1 నుంచి జరుగుతున్నఈ పరీక్షలకు ఇప్పటివరకు 75% హాజరు నమోదైంది. కంబైన్డ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా…నిన్న పలు పరీక్షా కేంద్రాల్లో సర్వర్‌ సమస్య వల్ల పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఈ పరీక్షలు మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది.