Home   »  ఉద్యోగం   »   AP లో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 పరీక్ష

AP లో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 పరీక్ష

schedule mounika
Group-1 Prelims

అమరావతి: AP లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 301 కేంద్రాల్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. మొత్తం 72.3 శాతం (91,463) మంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. అయితే, పరీక్ష కఠినంగా మరియు సులభంగా కాకుండా మిశ్రమంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. అర్థమెటిక్‌, రీజనింగ్‌ ప్రశ్నలు మరీ కఠినంగా లేవని, పాలిటీలో మాత్రం లోతైన ప్రశ్నలు ఇచ్చారని చెప్పారు. హిస్టరీ, జాగ్రఫీలోనూ ప్రశ్నలు కొన్ని కఠినంగా, కొన్ని సులభంగా ఉన్నాయన్నారు. ఇటీవల జరిగిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గ్రూప్‌-1 విషయంలో APPSC కఠిన వైఖరిని వీడినట్టు తెలుస్తోంది.

Group-1 Prelims పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతి…

కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) కు 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాని, మొత్తం 91,463 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ లో ముందుగా ప్రిలిమ్స్ పరీక్షను మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 ప్రశ్నలు నిర్వహించారు. ఒక్కో పేపర్ కు 2గంటల సమయం కేటాయించారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. ఇక మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితో పాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ALSO READ: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తున్నట్లు AP హైకోర్టు తీర్పు..!