Home   »  ఉద్యోగం   »   Group 4 results | ఈ నెల ఆఖరు లోగా గ్రూప్ 4 ఫలితాలు

Group 4 results | ఈ నెల ఆఖరు లోగా గ్రూప్ 4 ఫలితాలు

schedule sirisha

తెలంగాణ | Group 4 results : TSPSC గ్రూప్ 4 ఫైనల్ కీ 2023 ఇటీవల విడుదలైంది. దీంతో ప్రశ్నల తొలగింపుపై క్లారిటీ ఇచ్చింది. పేపర్-1లో మొత్తం 7 ప్రశ్నలు తొలగించబడ్డాయి. మరో 8 ప్రశ్నలు ఆప్షన్‌గా జోడించబడ్డాయి. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించి 5 ప్రశ్నలను ఆప్షన్‌లుగా చేర్చారు.

ఈ తుది కీ TSPSC వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంది. ఆగస్టు 28న TSPSC గ్రూప్-4 పరీక్ష ప్రిలిమినరీ కీని విడుదల చేసిన అధికారులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరించారు.

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతనే తుది కీ విడుదలైంది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి జూలై 1న రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) నిర్వహించారు.

ఈ నెల ఆఖరు లోగా గ్రూప్ 4 ఫలితాలు (Group 4 results)

తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా, 80 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరిక్ష రాశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 4 ఫలితాలు 2023 కూడా ఈ నెలాఖరు లోగా విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు అని ఉన్నతాధికారులు తెలిపారు.