Home   »  ఉద్యోగం   »   డిగ్రీ అర్హతతో 995 గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ అర్హతతో 995 గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

schedule sirisha

IB ACIO Exam | అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IB ACIO Exam

IB ACIO Exam | కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (I.B) భారీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనరల్ డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 995 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు లెవల్-7 పే-స్కేల్‌తో మొదటి నెల నుండి రూ.80 వేల కంటే ఎక్కువ జీతం పొందవచ్చు.

ఎంపికైన అభ్యర్థుల బేసిక్ వేతనం రూ.44,900

SSC, రైల్వే, బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఈ పోటీ పరీక్షకు హాజరుకావచ్చు. తాజా గ్రాడ్యుయేట్లు కూడా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.ఉద్యోగ అవకాశం పొందిన వారికి బేసిక్ వేతనం రూ.44,900తోపాటు D.A, S.S.A, H.R.A ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తానికి వారికి మొదటి నెల నుంచి రూ.80 వేలకు తగ్గకుండా జీతం వస్తుంది.

IB ACIO Exam పరీక్ష విధానం

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. టైర్-1 పూర్తిగా ఆబ్జెక్టివ్ మోడ్ మరియు టైర్-2 డిస్క్రిప్టివ్ మోడ్ గా వస్తాయి.

టైర్-1 పరీక్ష: టైర్-1 పరీక్ష వ్యవధి ఒక గంట ఉంటుంది. ఇందులో 5 విభాగాల నుంచి 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లో ఒక్కొక్కటి 20 ప్రశ్నలు వస్తాయి.

టైర్-2 పరీక్ష: ఈ పరీక్షకు కూడా ఒక గంట వ్యవధి ఇస్తారు. ఈ విభాగంలో 50 మార్కులు ఉంటాయి. ఇందులో SA 30 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిషన్ రైటింగ్ 20 మార్కులకు ఉంటుంది.

గ్రేడ్‌-2 ఉద్యోగ వివరాలు

  • మొత్తం ఖాళీలు: 995
  • అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయస్సు: 15 డిసెంబర్ 2023 నాటికి 18 -27 ఏళ్లు. SC మరియు STలకు ఐదేళ్లు, OBCలకు గరిష్ట వయస్సు సడలింపు మూడేళ్లు, భర్త చనిపోయిన, విడాకులు తీసుకున్న మరియు మళ్లీ పెళ్లి చేసుకోని సాధారణ మహిళలకు 35 సంవత్సరాలు, S.C, S.Tలకు 40 ఏళ్ల వరకు మినహాయింపు వర్తిస్తుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2023.
  • పరీక్ష రుసుము: రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.450 అభ్యర్థులందరూ చెల్లించాలి. ఇది కాకుండా, UR, EWS మరియు OBC కేటగిరీల పురుషులు రూ.100 పరీక్ష రుసుము చెల్లించాలి.
  • పరీక్ష తేదీలు: ప్రకటించబడలేదు.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో..అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణాలో..హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
  • పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.mha.gov.in/en

Also read: తెలంగాణలో జాబ్ మేళా… 35 కంపెనీలు… 2000 ఉద్యోగాలు